2016 బ్లాక్‌బస్టర్ దంగల్‌తో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి సుహానీ భట్నాగర్ ఈరోజు ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె వయస్సు కేవలం 19. నివేదిక ప్రకారం, ఆమె కాలు ఫ్రాక్చర్‌తో బాధపడుతున్న తర్వాత మందులు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు సమాచారం. అయితే ఆమె మృతికి గల కారణాలపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.
దంగల్‌లో బబితా ఫోగట్ పాత్రలో సుహాని నటించింది. ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ఆమె కొన్ని టెలివిజన్ ప్రకటనల్లో కనిపించింది.
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా సుహాని మరణాన్ని ధృవీకరించింది. “మా సుహాని చనిపోయిందని విన్నందుకు మేము చాలా బాధపడ్డాము. ఆమె తల్లి పూజాజీకి మరియు కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక సానుభూతి. ఇంత ప్రతిభావంతురాలైన యువతి, ఇంతటి టీమ్ ప్లేయర్, సుహాని లేకుంటే దంగల్ అసంపూర్ణంగా ఉండేది” అని ఆ నోట్లో రాసారు. “సుహానీ, నువ్వు మా హృదయాల్లో ఎప్పుడూ స్టార్‌గా మిగిలిపోతావు, నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో”అని అందులో పేర్కొన్నారు.
