బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం షూటింగ్ లో నిమగ్నమై ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర: పార్ట్ 1 చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. అయితే, నందమూరి కుటుంబ అభిమానులకు ఓ ఎగ్జైటింగ్ అప్డేట్.
జూనియర్ ఎన్టిఆర్ బ్లాక్‌బస్టర్ చిత్రం సింహాద్రి మార్చి 1,2024 న గ్రాండ్ రీ-రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తరువాత నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ సమరసింహారెడ్డిని మార్చి 2, 2024న రీ-రిలీజ్ చేయడం ఖాయమైంది. రెండు సినిమాలు 4K ఫార్మటు లో ప్రదర్శించబడతాయి, పెద్ద స్క్రీన్‌పై మెరుగైన వీక్షణ అనుభవాన్ని ఇస్తాయి.
థియేటర్లలో ఈ ప్రియమైన సూపర్ హిట్లను మళ్లీ ఆస్వాదించే అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ప్రకటన రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రిలో భూమిక కథానాయకి కాగ, బి గోపాల్ దర్శకత్వం వహించిన సమరసింహారెడ్డి చిత్రంలో అంజలా జవేరి మరియు సిమ్రాన్ బగ్గా హీరోయిన్లుగా నటించారు.