రిమాండ్ పదవీ కాలం ముగియడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు.
తనను కోర్టుకు తీసుకువెళుతుండగా.. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని కవిత అన్నారు.
నిందితుల్లో ఒకరు బీజేపీలో చేరారని, మరొకరు బీజేపీ టికెట్ పొందారని, మూడో నిందితుడు రూ. 50 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిజెపికి అందజేశారు.
తాను అప్రూవర్‌గా మారనని, క్లీన్‌గా బయటకు వస్తాననే విశ్వాసాన్ని కవిత వ్యక్తం చేశారు. “కడిగిన ముత్యంలా బైటికి ఒస్తా” అంటూ కోర్టులోకి అడుగుపెట్టింది కవిత. ఆమె మద్దతుదారులు “జై తెలంగాణ” మరియు “జై కవిత” అని తమ మద్దతును తెలియజేస్తూ నినాదాలు చేశారు.
కాగా, కవితను 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును అభ్యర్థించింది. కేసు పురోగతిలో ఉందని, మరికొంత మందిని ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తెలిపింది. మరోవైపు, కవిత కుమారుడికి బోర్డు పరీక్షలు జరుగుతున్నందున మధ్యంతర బెయిల్‌ను కవిత తరఫు న్యాయవాదులు కోరారు. ఇరువర్గాల వాంగ్మూలాలను విన్న న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. ఏప్రిల్ 1న కవిత మధ్యంతర బెయిల్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది.