సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలను జరుపుకోనుంది. బాలయ్య సంబరాలను ఘనంగా నిర్వహించాలని టాలీవుడ్‌కు సంబంధించిన పలు చిత్ర సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు ఈరోజు చిరంజీవిని కలిసి ఆహ్వానించారు.
భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కెఎల్ నారాయణ, మాదాల రవి, అనుపమ్ రెడ్డి, నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు వీర్ శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు.
బహుశా, ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాకపోవచ్చు, ప్రస్తుతం ఆయన విశ్వంభర చిత్ర పనిలో బిజీగా ఉన్నారు.