ఇప్పటి వరకు తెలుగు లో విడుదలయ్యి అత్యధిక వసూళ్లు సాధించిన మాలీవుడ్ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన తెలుగు వెర్షన్ భారీ విజయాన్ని సాధించింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మే 3,2024 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషలలో ఓటిటి లో ప్రసారం కానుంది అని వినికిడి. ఇక మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువాల్, లాల్ జూనియర్, తదితరులు నటించారు. మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి.