ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నటుడికి, అతని కుటుంబ సభ్యులకు ఏమీ జరగలేదు.
నివేదికల ప్రకారం, సల్మాన్ ఖాన్ నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఈ రోజు ఉదయం 5 గంటలకు పలు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
సల్మాన్ చాలా కాలంగా గ్యాంగ్‌స్టర్ల టార్గెట్. గతేడాది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ నటుడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. గాయకుడు సిద్ధు మూసేవాలాకు ఎదురైన గతినే సల్మాన్‌కు ఎదురవుతుందని బిష్ణోయ్ తన లేఖలో పేర్కొన్నాడు.
సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్ 3 చిత్రంలో కనిపించారు. ఇటీవల ఆయన ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం సికందర్ ను ప్రకటించారు. దీనిని 2025 ఈద్ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.