ఈ మధ్య కాలంలో మలయాళంలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ప్రేమలు ఒకటి. స్టార్‌డమ్ లేని యువకులతో రూపొందించిన ఇది బాక్సాఫీస్ పెద్ద వసూళ్లను సాధించింది. ఇప్పుడు తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ప్రేమలు డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేశారు. డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రేమలు కథ హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది. కాబట్టి, ప్రదేశాలు సుపరిచితమైనందున, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రంతో బాగా కనెక్ట్ కావచ్చు. గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రంలో నస్లెన్ కె.గఫూర్, మమిత బైజు ప్రధాన పాత్రలు పోషించారు.