బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 11వ చిత్రం కోసం షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించబోయే ఒక ప్రత్యేకమైన చిత్రం కోసం దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటితో చేతులు కలపనున్నారు. పవిత్రమైన శ్రీ రామ నవమి సందర్భంగా, ఈ కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా బిఎస్ఎస్11ని అధికారికంగా ప్రకటించారు.
పోస్టర్‌లో శ్రీరాముడి పాత్రతో షాడో ప్లే కనిపిస్తుంది. రాముడు తన విల్లు మరియు బాణంతో దెయ్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం కనిపిస్తుంది. అడవికి సమీపంలో ఒక గోపురం చూడవచ్చు. ఈ ఉత్కంఠభరితమైన మరియు భయపెట్టే పోస్టర్ సూచించినట్లుగా, బిఎస్ఎస్11 ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని ఇవ్వబోతోంది. ఇది భయాన్ని ప్రేరేపించడం ద్వారా ఆశను రేకెత్తించే మూలకథ ఇది. పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రధాన సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ ప్రకటించారు. అజ్నీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీని చూసుకుంటారు.