బీఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవితను నిన్న సాయంత్రం సీబీఐ అరెస్టు చేసిన తరువాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆమెను ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజ ముందు హాజరుపరిచారు.
కవితకు ఐదు రోజుల కస్టడీ అవసరమని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత కీలక కుట్రదారు అని ఆరోపించింది. కంపెనీకి ఎన్ఓసి పొందడంలో రాఘవ్ మాగుంటకు కవిత సహాయం చేసిందని కూడా పేర్కొన్నారు.
నవంబర్-డిసెంబర్ 2021లో కవిత శరత్ రెడ్డిని ప్రతి జోన్ కు ఐదు కోట్ల చొప్పున రూ.25 కోట్లు ల్లించాలని కవిత కోరినట్లు సీబీఐ పేర్కొంది.ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడానికి శరత్ రెడ్డి విముఖత చూపినట్లు సమాచారం. అప్పుడు, కవిత అతని వ్యాపారాన్ని దెబ్బతీస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.
కస్టడీలో విచారించినప్పుడు కవిత సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని సిబిఐ ఆరోపించింది. సరైన ఆధారాలతో ఆమెను బంధించాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల, ఆమె కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని వారు కోరారు.
