ఇటీవల అబ్రహం ఓజ్లర్ అనే మలయాళ చిత్రం టిక్కెట్ విండోల వద్ద ఆశ్చర్యం కలిగించింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిట్ స్టేటస్ సాధించింది. అబ్రహం ఓజ్లర్ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్, ఇందులో జయరామ్ ప్రధాన పాత్రలో నటించారు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి సుదీర్ఘమైన అతిధి పాత్రలో నటించారు.
కొన్ని నివేదికల ప్రకారం, అబ్రహం ఓజ్లర్ రేపు ప్రైమ్ వీడియోకి వస్తది అని భావిస్తున్నారు. అయితే, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఇంకా ప్రకటన ఇవ్వలేదు. చాలా వరకు, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సినిమా ప్రైమ్‌లో వచ్చే అవకాశం ఉంది. జయరామ్ కెరీర్లో అబ్రహం ఓజ్లర్ తో అత్యధిక వసూళ్లు రాబట్టాడు. దీనికి మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు.
అబ్రహం ఓజ్లర్ లో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇర్షాద్ ఎమ్. హాసన్, దర్శకుడితో కలిసి నేరాంబోక్కు, మాన్యువల్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
