నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత కమ్ నటుడు జాకీ భగ్నానీ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్లో వివాహం చేసుకున్నారు. ఈ జంట వారి కుటుంబ సంస్కృతులను ప్రతిబింబిస్తూ సిక్కు, సింధీ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అందమైన వివాహ ఫోటోలను పంచుకుంది.

కామెంట్ల విభాగంలో కొత్త జంటకు అభిమానుల నుండి విపరీతమైన ప్రేమ లభిస్తోంది. రకుల్ మరియు జాకీ భగ్నానీ చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు, మరియు అక్టోబర్ 2021 లో, వారు తమ రిలేషన్షిప్ స్టేటస్ పబ్లిక్‌గా చెప్పారు. ఈ వివాహానికి వరుణ్ ధావన్, శిల్పా శెట్టి, ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, ఈషా డియోల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఫిబ్రవరి 19న హల్దీ వేడుకలతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత మెహందీ, సంగీత వేడుకలు జరిగాయి. ప్రజానీకం తరుపున కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న జంటకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.