ఒకప్పుడు తన సోదరుడిని భుజాన వేసుకున్న షర్మిల ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శకురాలిగా మారారు. ఆమె కడపలో లేదా ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తనను కోరితే పులివెందుల నుంచి తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోటీ చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.
తన సోదరుడిపై పోటీకి సిద్ధమని చెప్పిన షర్మిల, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే తాను గానీ, రఘువీరారెడ్డి గానీ, పల్లంరాజు గానీ పోటీకి సిద్ధం కావాలని సూచించారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి షర్మిల తన సోదరుడు జగన్‌పైనా, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు.
షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయవచ్చని సమాచారం. పులివెందులలో కూడా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.